ఊరెళ్ళి వచ్చేసరికి ఇల్లు గుళ్ల చేసిన దొంగలు

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో దొంగలు ఓ ఇళ్లును గుళ్ల చేసిన సంఘటన శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

ఊరెళ్ళి వచ్చేసరికి ఇల్లు గుళ్ల చేసిన దొంగలు
X

దిశ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో దొంగలు ఓ ఇల్లును గుళ్ల చేసిన సంఘటన శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. గోపాలరావుపేట గ్రామానికి చెందిన కూనారాపు సత్యనారాయణ భార్యతో కలిసి నెల రోజుల క్రితం పుణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కుమారుడి వద్దకు వెళ్ళారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌లో ఉంటున్న సత్యనారాయణ తమ్ముడు రవి, తల్లి లక్ష్మీని తీసుకొచ్చి ఇంటి తలుపు తెరవగానే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లోని విలువైన వస్తువులతో పాటుగా సుమారు మూడు తులాల బంగారం, 10 తులాల వెండి దొంగిలించినట్లు తెలుస్తుంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఏడూళ్ల బయ్యారం సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.

Next Story