- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ ఆడటంపై బీసీసీఐ కీలక ప్రకటన!
భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా చర్చ జరిగింది. లార్డ్స్ వేదిక గా రిటైర్మెంట్ ఇస్తాడని కూడా ప్రచారం చేశారు. కానీ బీసీసీఐ మాత్రం ఆ వార్తలను కొట్టి పారేసింది. అయినప్పటికీ రెండు రోజులుగా రిటైర్మెంట్ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే దీనిపై మరోసారి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మరోసారి స్పందించారు.
రోహిత్ శర్మ భారత జట్టులో భాగమని.. ఆయన ఆటను కొనసాగిస్తారని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అంటూ.. రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టారు. ఇప్పటికైతే రోహిత్ శర్మ రిటైర్ అయ్యే అవకాశాలు లేవని... తమతో ఎలాంటి విషయం చర్చించలేదన్నారు. దీంతో వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడటం గ్యారెంటీ అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.






