- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం లూటీ చేశాడు.. జగన్‌పై జూలకంటి ఫైర్
by Vemula.Srinu Prasad |
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు లూటీకి గురైయ్యాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మండల పరిధిలోని వేపకంపల్లి గ్రామంలో వేపకంపల్లి, చినకొదమగండ్ల గ్రామాల రైతులకు కూటమి ప్రభుత్వం అందజేసే రాజ ముద్రతో ముంద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..

X
దిశ, కారంపూడి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు లూటీకి గురైయ్యాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మండల పరిధిలోని వేపకంపల్లి గ్రామంలో వేపకంపల్లి, చినకొదమగండ్ల గ్రామాల రైతులకు కూటమి ప్రభుత్వం అందజేసే రాజ ముద్రతో ముంద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దాదాపు 1500 మంది రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి, మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల భూములకు భద్రత లేదని, సర్వేరాళ్లపై, పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకుని, బ్యాంకుల్లో తాకట్టుపెట్టి దోచుకోవాలని చూశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేను ప్రజలు సద్వినియోగపర్చుకోవాలని కోరారు.
Next Story






