- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా.. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనతో రాష్ట్రపతి ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. అలాగే ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వినియోగదారులు, ఆహార సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా ఆయనే నిర్వర్తించనున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం.. ఢిల్లీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండేలకు అధిష్టానం నుంచి పిలుపు రాగా.. వారిలో ఒకరికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర సీఎం కూడా మారుతారన్న చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్రం. కేబినెట్ విస్తరణలో విద్యాశాఖ మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలను ఎవరికి ఇస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది.






