- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి భూమికి భూధార్ నంబర్ల ఏర్పాటు కోసమే భూముల రీ-సర్వే
రైతులకు ఉన్న ప్రతి భూమికి భూధార్ నంబర్ల ఏర్పాటు కోసమే భూముల రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు.

దిశ, వెల్దుర్తి : రైతులకు ఉన్న ప్రతి భూమికి భూధార్ నంబర్ల ఏర్పాటు కోసమే భూముల రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మాసాయిపేట మండలం పోతంశెట్టిపల్లి గ్రామాన్ని ప్రభుత్వం మొదటి విడతలోనే భూముల రీ-సర్వేకు ఎంపిక చేయగా, శనివారం గ్రామంలో నిర్వహించిన భూ భారతి భూముల రీ-సర్వే రైతు అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతులకు ఉన్న ప్రతి భూ సమస్యను పరిష్కరించేందుకు ఈ భూ రీ-సర్వే కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వచ్చే వారం నుంచి ఈ సర్వే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. గ్రామంలోకి భూముల డిజిటల్ సర్వేకు వచ్చిన అధికారులు మొదట గ్రామంలోని తొలి సర్వే నంబర్ నుంచి చివరి సర్వే నంబర్ వరకు సర్వే నిర్వహించి, ప్రతి రైతుకు ఎన్ని చోట్ల భూములు ఉంటే అన్ని భూములకు భూధార్ నంబర్లు కేటాయిస్తారని అదనపు కలెక్టర్ వివరించారు. గ్రామంలో ఎన్ని రోజులైనా సరే సమయం వెచ్చించి అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో బావయ్య, గ్రామ సర్పంచ్ ప్రశాంత్, ఆర్‌ఐ దన్ సింగ్, మండల బీజేపీ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, రైతులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.






