ధర్మేంద్ర ప్రధాన్ త‌ర‌హాలోనే రాజీనామా చేసిన కేంద్ర మంత్రులు !

by velandi.Saikiran |

ధర్మేంద్ర ప్రధాన్ త‌ర‌హాలోనే గ‌తంలోనూ కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ త‌ర‌హాలోనే రాజీనామా చేసిన కేంద్ర మంత్రులు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో రాజీనామా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో దిగొచ్చిన ఆయ‌న‌..రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే మొదటి డిమాండ్‌గా పెట్టిన సీజేపీ.. నీట్ పేపర్ లీక్ జరిగినప్పటి నుంచి దిల్లీ జంతర్మంతర్ వద్ద తీవ్ర ఆందోళనలు చేసింది. ఇక‌ సీజేపీ విధించిన డెడ్లైన్ లోగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ లాగానే గ‌తంలోనూ ప‌లుగురు కేంద్ర మంత్రులు తీవ్ర నిర‌స‌న‌ల కార‌ణంగా రాజీనామా చేసిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి.

లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి రాజీనామా చేశారు. 1956 సంవత్సరంలో తమిళనాడులోని అరియ‌లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి 142 మంది మరణించారు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశారు. 1958లో ఎల్ఐసీ పెట్టుబడులకు సంబంధించిన ముంద్రా క్యాంప్ వివాదంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి టీటీ కృష్ణమాచారి కూడా రాజీనామా చేశారు. 1962లో ఇండియా, చైనా యుద్ధంలో దేశ రక్షణ సన్నద్ధతపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అప్పటి వీకే కృష్ణ మీనన్ రక్షణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

1983లో నాగాలాండ్ లో తీవ్ర శాంతి భద్రతల సమస్యలకు బాధ్యత వహిస్తూ అప్ప‌టి కేంద్ర హోం శాఖ మంత్రి పీవి నరసింహారావు కూడా రాజీనామా చేశారు. 1987 రక్షణ శాఖ కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై ఒత్తిడి పెరగడంతో అప్పటి రక్షణ మంత్రి వీపీ సింగ్ కూడా రిజైన్ చేశారు. 1999లో వెస్ట్ బెంగాల్లోని గైస‌ల్ వద్ద రైలు ప్రమాదానికి 280 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి నితీష్ కుమార్ కూడా రాజీనామా చేశారు. 2008 ముంబై 26/11 దాడుల నేపథ్యంలో భద్రత వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ కూడా రిజైన్ చేశారు.

Next Story