- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీ ఉద్యోగి సస్పెండ్
హర్యానా కురుక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిపై తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన చర్యలు తీసుకుంది. ఆలయంలో అసిస్టెంట్ షరాఫ్‌గా విధులు నిర్వహిస్తున్న పి. గిరిని శనివారం విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది. ..

దిశ, వెబ్ డెస్క్: హర్యానా కురుక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిపై తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన చర్యలు తీసుకుంది. ఆలయంలో అసిస్టెంట్ షరాఫ్‌గా విధులు నిర్వహిస్తున్న పి. గిరిని శనివారం విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది. భక్తుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై వేటు వేసింది. సదరు ఉద్యోగి టీటీడీ అధికారిక పేరును దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. స్వామివారి అన్నదానం, కల్యాణోత్సవం, అలాగే వివిధ వాహన సేవల పేరుతో ప్రత్యేక పూజలు చేయిస్తామని భక్తుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి.
భక్తుల నుంచి ఫిర్యాదుల వెల్లువ
అంతేకాదు సదరు ఉద్యోగిపై భక్తుల నుంచి ఫిర్యాదుల అందాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు లోతుగా విచారణ జరిపారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ షరాఫ్ పి. గిరి అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. దీంతో సమగ్ర నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన టీటీడీ యాజమాన్యం..సదరు ఉద్యోగిపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసింది. భక్తులను మోసం చేసేలా ఆలయ ఉద్యోగులు ఎవరు వ్యవహరించినా సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.






