సెల్ ఫోన్ దొంగల ముఠా అరెస్ట్

by Batti.Sumithra |   (  Updated:2026-07-25 12:46:49  IST  )

మొబైల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద ఎనిమిది మొబైల్ ఫోన్లతో పాటు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటన గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సెల్ ఫోన్ దొంగల ముఠా అరెస్ట్
X

దిశ, కార్వాన్ : మొబైల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద ఎనిమిది మొబైల్ ఫోన్లతో పాటు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటన గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుల్సుంపుర ఏసీపీ తిరుపతి, ఇన్స్పెక్టర్ రామయ్యతో కలిసి శనివారం వివరాలను వెల్లడించారు. జూలై 19న తెల్లవారుజామున సుమారు 3:00 గంటల ప్రాంతంలో ఆటో డ్రైవర్ అమిత్ జాదవ్ తన ఆటోను పిల్లర్ నంబర్ 104 వద్ద నిలిపి పక్కకు వెళ్లాడు. ఆ సమయంలో రెండు బైక్‌ల పై వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలోని ఆయన రెడ్‌మీ 15 ఫోన్‌ను దొంగిలించారు. బాధితుడు అడ్డుకోవడానికి యత్నించగా కత్తితో బెదిరించి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన ఇస్మాయిల్ అయాన్ (20), మహమ్మద్ అమర్ బిన్ అస్ఘర్ (18), మహమ్మద్ అబూబకర్ బిన్ అయూబ్(22), మహమ్మద్ రమీజ్ రజా అలియాస్ సోహైల్ (22), మహమ్మద్ కాశిఫ్ (26) ను రేతిబౌలి ఎక్స్ రోడ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఎనిమిది మొబైల్ ఫోన్లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో ముగ్గురు ఇమ్రాన్, అబ్దుల్ మాలిక్, ఇమ్రాన్ అలియాస్ సల్మాన్, షరీఫ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.

Next Story