- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మేంద్ర ప్రదాన్‍పై కుట్ర.. రాజాసింగ్ హాట్ కామెంట్స్
ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాతో సంబరాలు చేసుకుంటున్న యువత సంబరాలు జరుపుకునే ముందు ఒక్క విషయం ఆలోచించాలని రాజాసింగ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ధర్మేంద్ర ప్రదాన్ విదేశీ శక్తుల కుట్రకు బలయ్యారని ఇది చాలా దురదృష్టకరం అన్నారు. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆయన.. ప్రదాన్ మంత్రి అయ్యాక విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకు వచ్చారన్నారు. దేశంలోని అనేక రాష్ట్రంలో పేపర్ లీక్స్ జరుగుతున్నాయని కానీ వీటిని మంత్రిని, ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయడం తప్పు అన్నారు. మంత్రి కింద అనేక మంది అధికారులు ఉంటారన్నారని అందువల్ల వీటికి మంత్రి ఒక్కరే బాధ్యుడు కాదన్నారు. నిరసనకారుల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని జంతర్ మంతర్ ధర్నాకు యువకులకు లక్షల్లో డబ్బులు ఇచ్చి వారిని ఆయా రాష్ట్రాల నుంచి ఫ్లైట్‍లలో మరీ తరలించాలని ఆరోపించారు. నేపాల్ లో ప్రభుత్వాన్ని కూల్చేసిన విధంగా అదే రకంగా భారత్ లోనూ చేయాలని ఆ విదేశీ శక్తులు యువతను అడ్డుపెట్టుకుని మొదటి విడతగా జంతర్ మంతర్ వేదికగా ప్రయత్నించాయని ఆరోపించారు.
మోడీ అలా జగనివ్వలేదు:
కానీ మన ప్రధాని మోడీ అలా జరగకుండా నిర్ణయం తీసుకున్నారని మన యువత సంతోషంగా ఉండటమే ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రదాన్ రాజీనామా చేస్తే యువకులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మంచి గురించి సంబరాలు చేసుకోవాలన్నారు. కానీ మీ వెనకాల ఉన్న విదేశీ శక్తుల ద్వారా భవిష్యత్‍లో మీకే చాలా నష్టం జరుగుతుందన్నారు. మీ వల్ల దేశానికే నష్టం జరుగుతుందని ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. నిరసనల వెనుక కాంగ్రెస్‍తో పాటు ఏయే పార్టీ ఉందో అందరి ముఖాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసినప్పటికీ ఆయన ప్రతి ఒక్క భారతీయుడి గుండెలో ఉంటారని చెప్పారు.






