భార‌త్ వ‌రుస ఓట‌ములు...బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

by velandi.Saikiran |

భార‌త్ వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

భార‌త్ వ‌రుస ఓట‌ములు...బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో భారత ఆట‌తీరుపై బీసీసీఐ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది. రెండు జట్ల చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ కీలక ప్రకటన చేశారు. సపోర్టు స్టాఫ్ లో కొందరి కాంట్రాక్టు ముగిసిందని తెలిపారు. దీనిపైన కూడా చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల కోసం ఈ నెల 28వ తేదీన భారత జట్టును ప్రకటిస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ఐర్లాండ్ తో టీ20 సిరీస్, ఇంగ్లాండ్ తో టీ20తో పాటు వన్డే సిరీస్ కూడా భారత్ కోల్పోయింది. ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో భారత జట్టు బిజీగా ఉంది.

Next Story