- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయ వ్యవహారాల విషయపరిజ్ఞానం కోసం పుస్తకాన్ని రచించడం అభినందనీయం : జస్టిస్ టి. మాధవి దేవి
సామాన్య ప్రజలకు న్యాయ సంబంధిత వ్యవహారాలపై విషయపరిజ్ఞానం కల్పించేందుకు పుస్తకాన్ని రచించడం అభినందనీయమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవి అన్నారు.

దిశ, రవీంద్రభారతి : సామాన్య ప్రజలకు న్యాయ సంబంధిత వ్యవహారాలపై విషయపరిజ్ఞానం కల్పించేందుకు పుస్తకాన్ని రచించడం అభినందనీయమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవి అన్నారు. రవీంద్రభారతిలో పీపీ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది డాక్టర్ శ్రవణ్ కుమార్ రచించిన "ది ఇండియన్ లా ఆఫ్ ప్రాపర్టీ డ్యూ డిలిజెన్స్ అండ్ టైటిల్ ఎగ్జామినేషన్" పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆస్తి చట్టం పై సమగ్ర విశ్లేషణలతో రూపొందించిన ఈ పుస్తకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రచయిత డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, ఏదైనా స్థలం లేదా భవనం కొనుగోలు చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు, వాటి న్యాయపరమైన పరిష్కారాలను ప్రధాన అంశంగా తీసుకుని ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉందని, పుస్తకం కావాలనుకునేవారు 80956 69480 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యులు హనుమంత్ రెడ్డి, విశ్రాంత ఏపీ ట్రిబ్యునల్ సభ్యులు జానకి రామారావు, రచయిత తండ్రి డి.బి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






