రాబోయే 3 గంటలు జాగ్ర‌త్త‌...ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రాబోయే 3 గంటలు జాగ్ర‌త్త‌...ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం 7 గంటలలోపు వర్షాలు కురిసే ఛాన్సులు ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది వాతావరణ శాఖ.

అటు హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాలలో కూడా ఇవాళ సాయంత్రంలోపు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు, సాధారణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్న క్ర‌మంలో చెట్ల కింద అస్సలు నిలబడకూడదని వివరించింది.

Next Story