యంగ్ ఇండియా స్కూల్ తరలింపు పై బీఆర్ఎస్ ధర్నా

by Batti.Sumithra |

సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన 'యంగ్ ఇండియా స్కూల్'ను వేరే చోటికి తరలించే కుట్ర జరుగుతోందని కొండపాక బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.

యంగ్ ఇండియా స్కూల్ తరలింపు పై బీఆర్ఎస్ ధర్నా
X

దిశ, కొండపాక : సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన 'యంగ్ ఇండియా స్కూల్'ను వేరే చోటికి తరలించే కుట్ర జరుగుతోందని కొండపాక బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో రోడ్డు పై బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ నాయకుల కక్ష సాధింపు వల్లే పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని, 'అఖిలపక్షం' పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story