- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు తవ్వారు.. వదిలేశారు
అభివృద్ధి పనుల పేరిట రోడ్లు తవ్వేయడం.. ఆ తర్వాత వాటిని అలాగే వదిలేయడం అధికారులకు అలవాటుగా మారింది.

దిశ, ఆమనగల్లు : అభివృద్ధి పనుల పేరిట రోడ్లు తవ్వేయడం.. ఆ తర్వాత వాటిని అలాగే వదిలేయడం అధికారులకు అలవాటుగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారు ఉదాసీనత రోడ్డు పై వెళ్లే ప్రయాణికులకు, స్థానికులకు శాపంగా మారింది. పైప్‌లైన్ పనుల పేరుతో తవ్వకాలు జరిపి, ఆ తర్వాత పనులు పూర్తి చేయకుండా సగంలోనే వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ప్రారంభించిన సమయంలో తవ్వకాలు జరిపిన సిబ్బంది, ఆ తర్వాత అటువైపు చూడడమే మానేశారు. తవ్విన గుంతలతో రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి స్థానికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆమనగల్లు పురపాలక సంఘంలోని 15వ వార్డు ఉదయ్‌నగర్ కాలనీలో తాగునీటి కోసం గుత్తేదారు పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. పనులు మొదలుపెట్టినప్పటి నుంచి అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
పట్టించుకోని అధికారులు..
రోడ్డు పరిస్థితి పై స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు, గుత్తేదారుకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే నిద్రమత్తు వీడి రోడ్డుతో పాటు గుంతలను పూడ్చి, ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






