రామాలయంలో శ్రీరామాత్మక వరుణయాగం

by Jakkula.Mamatha |

శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆషాడ శుద్ధ ఏకాదశి(తొలి ఏకాదశి)ని పురస్కరించుకుని ఆదివారం శ్రీరామాత్మక వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు.

రామాలయంలో శ్రీరామాత్మక వరుణయాగం
X

దిశ, భద్రాచలం: ప్రస్తుతం నెలకొన్న వర్షాభావం కారణంగా, పంటలపై ప్రభావం చూపి కరువు పరిస్థితులు తలెత్తకుండా.. భగవంతుని అనుగ్రహం కోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆషాడ శుద్ధ ఏకాదశి(తొలి ఏకాదశి)ని పురస్కరించుకుని ఆదివారం శ్రీరామాత్మక వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయమే ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులకు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు.యాగశాలలో వేదమంత్రాల నడుమ వరుణ యాగం శాస్త్రోక్తంగా జరిగింది.

Next Story