మైనర్ బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి పై పోక్సో కేసు నమోదు

by Batti.Sumithra |

మైనర్ బాలికను గర్భవతిని చేసిన నిందితుడిపై టూ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

మైనర్ బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి పై పోక్సో కేసు నమోదు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: మైనర్ బాలికను గర్భవతిని చేసిన నిందితుడిపై టూ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎం. మురళి తెలిపిన వివరాల ప్రకారం, మైనర్ బాలిక గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండగా, ఆమె తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలికను ఆరా తీయగా, సిద్దిపేటకు చెందిన ఆరోళ్ల నర్సింలు గత కొద్ది రోజులుగా తనను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితుడు ఆరోళ్ల నర్సింలును అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.

Next Story