డంపింగ్ చెత్తకు బీఆర్ఎస్ క్యాపింగ్ చేస్తే

by Ratna Kumari |

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై బీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయ విధానంలో క్యాపింగ్ చేపట్టి దుర్వాసనను నియంత్రించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంలో విఫలమైందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆరోపించారు.

డంపింగ్ చెత్తకు బీఆర్ఎస్ క్యాపింగ్ చేస్తే
X

దిశ, జవహర్‌నగర్ : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై బీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయ విధానంలో క్యాపింగ్ చేపట్టి దుర్వాసనను నియంత్రించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంలో విఫలమైందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేత కోసం నిర్వహించనున్న అవగాహన సదస్సు సందర్భంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ, మాజీ మేయర్ మేకల కావ్య, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం మల్లారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే లీచేట్‌ను శుద్ధి చేసి వినియోగించే విధంగా చర్యలు తీసుకున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. డంపింగ్ ప్రాంత అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులతో పలు పనులు చేపట్టామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. డంపింగ్ యార్డ్ కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, రాంకీ యాజమాన్యంపై ఉద్యమాత్మకంగా పోరాడి ప్రజల జీవించే హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో జవహర్‌నగర్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లామని, ప్రస్తుతం ఆ ప్రగతి నిలిచిపోయిందని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రూపొందించిన కరపత్రాలను మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, షేక్ షావలి, సుధాకరాచారి, రాజశేఖర్, ప్రసాద్, సుబ్రమణ్యం, డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story