బాసరలో పట్టపగలే చోరీ

by Batti.Sumithra |

మండల కేంద్రంలోని శారదానగర్‌ కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఆస్పత్రి పనిమీద ధర్మాబాద్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

బాసరలో పట్టపగలే చోరీ
X

దిశ, బాసర: మండల కేంద్రంలోని శారదానగర్‌ కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఆస్పత్రి పనిమీద ధర్మాబాద్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం శారదానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న రవూఫ్‌ ఇంట్లో 5 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.5 వేల నగదు చోరీకి గురైంది.

ఇటీవలే తన కుమారుడి వివాహం జరగడంతో బంగారు ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచినట్లు బాధితుడు రవూఫ్‌ తెలిపారు. ఆస్పత్రి పనిమీద ధర్మాబాద్‌కు వెళ్లేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లగా.. ఇదే అదనుగా భావించిన దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. షైన్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్‌కు సమాచారం అందించి ఆధారాలను సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story