రాంపూర్‌లో యువత సంచలన నిర్ణయం

by Batti.Sumithra |

గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల నిరుపేద కుటుంబాలు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువత, మహిళల ఆధ్వర్యంలో రాంపూర్‌లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఏకగ్రీవంగా తీర్మానించారు.

రాంపూర్‌లో యువత సంచలన నిర్ణయం
X

దిశ, నంగునూరు : గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల నిరుపేద కుటుంబాలు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువత, మహిళల ఆధ్వర్యంలో రాంపూర్‌లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామంలో మద్యం విక్రయాలు కుటుంబ కలహాలు, అప్పులు, యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సభలో ఆందోళన వ్యక్తమైంది. దీంతో గ్రామ పరిధిలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు లేదా బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.50 వేల జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలకు సహకరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోక మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, యువత చొరవతో తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

అలాగే రాంపూర్‌ను మద్యం రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామపంచాయతీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, డ్వాక్రా గ్రూప్ లీడర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామసభ తీర్మానాన్ని ప్రజలు స్వాగతిస్తూ మద్యం రహిత రాంపూర్ నిర్మాణానికి సహకరించాలని సంకల్పించారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ బొడిగె తిరుపతి గౌడ్, వార్డు సభ్యులు వెంకటేశ్, రాజు, పద్మ, నర్సవ్వ, మాజీ ఎంపీటీసీ ఎనగందుల నితిన్ కుమార్, క్షేత్ర సహాయకురాలు అమావాస్య, డ్వాక్రా గ్రూప్ లీడర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, సీఏ, మహిళలు, యువకులు అరుణ్ రెడ్డి, ప్రగత్ రెడ్డి, రాజేశ్, అమర్, గణేశ్, నవీన్, నాగరాజు, వాసు, గ్రామ పెద్దలు రాంరెడ్డి, లింగం, యాదగిరి, తిరుపతి, శ్రీహరి, నర్సింలు, బాపు రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story