ప్రైవేటు ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. ఫీజులు ఫిక్స్ చేసిన ప్రభుత్వం

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి బి.టెక్ (B.Tech), బి.ఆర్క్ (B.Arch), మెరైన్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫీజులను అధికారికంగా ప్రకటించింది...

ప్రైవేటు ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్.. ఫీజులు ఫిక్స్ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి బి.టెక్ (B.Tech), బి.ఆర్క్ (B.Arch), మెరైన్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫీజులను అధికారికంగా ప్రకటించింది. బి.టెక్ కోర్సులకు సంబంధించి కనీస వార్షిక ట్యూషన్ ఫీజును రూ. 47,000 గా ప్రాథమికంగా ఖరారు చేసింది. గత కనీస ఫీజు కంటే కొంత మేర సవరణలు చేసింది. అయినప్పటికీ ఇప్పటికే రూ. 47 వేల కంటే ఎక్కువ ఫీజు అమల్లో ఉన్న కళాశాలల విషయంలో గతంలో ఖరారైన విధానాన్ని తాత్కాలికంగా కొనసాగించనుంది. త్వరలో ప్రారంభం కానున్న వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ప్రక్రియ అంతా ప్రభుత్వం నిర్దేశించిన ఈ కొత్త ఫీజుల ప్రాతిపదికనే సాగనుంది. పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి, తరగతులను సకాలంలో ప్రారంభించేందుకు ఉన్నత విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Next Story