- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది : కేటీఆర్
పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పదని, జెన్-జీకి సెల్యూట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పదని, జెన్-జీకి సెల్యూట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో స్పందించిన కేటీఆర్.. ఎలాంటి రాజకీయ అండ లేకుండా, పార్టీలకు అతీతంగా తమకు జరిగిన అన్యాయాన్నే ఎజెండాగా చేసుకుని విద్యార్థులు సాగించిన ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. యువత చూపిన తెగువ, ఐక్యత, పోరాట పటిమ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. 'దేశ యువత లేవనెత్తిన ప్రశ్నలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు రాజకీయాలకే పరిమితమైతే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన అవసరాన్ని ఈ ఉద్యమం స్పష్టంగా చాటిచెప్పింది. పదవుల్లో ఉన్నవారు తమ నిర్ణయాలు, తప్పులకు బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకొని యువతకు అత్యంత కీలకమైన విద్య, ఉపాధిపైన దృష్టి సారించి వారి ఆకాంక్షల మేరకు పాలన సాగించాల్సిన అవసరాన్ని జెన్ జీ ఉద్యమం నిరూపించింది' అని కేటీఆర్ పేర్కొన్నారు.






