- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోడు ఎప్పుడు వస్తాడో.. అక్కినేని అఖిల్ కామెంట్స్ వైరల్
కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ‘లెనిన్’తో హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో అఖిల్.

దిశ, సినిమా: కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ‘లెనిన్’తో హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో అఖిల్. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అఖిల్‌తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీకి, నిర్మాత నాగవంశీకి కూడా ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ ఇవ్వంతో చిత్ర యూనిట్‌లో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం లెనిన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అఖిల్.. తన తదుపరి ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో.. తన కెరీర్‌లోనే కాకుండా అక్కినేని కాంపౌండ్‌లో మైలురాయిగా నిలిచిన ‘సిసింద్రీ’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘నాకు కొడుకు పుడితే ‘సిసింద్రీ 2’ సినిమా చేయాలని ఉంది. ఈ విషయాన్ని నా భార్యకు కూడా చెప్పా.. మావోడు ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు చేస్తామో చూడాలి’ అంటూ పాడ్ కాస్ట్‌లో తెలిపాడు. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిసింద్రీ’ సినిమాలో నాగార్జున ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం థియేటర్లకు రప్పించడంలో సంచలనం సృష్టించింది.






