- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, నంగునూరు : నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్‌కు సుమారు 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 20 సంవత్సరాలుగా మద్యానికి బానిస కావడంతో అతని భార్య హైదరాబాద్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతను తన తల్లి ఫరీదా బేగంతో కలిసి గ్రామంలో నివసిస్తున్నాడు.
ఈ నెల 21న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన జహంగీర్ తన తల్లితో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన కుమార్తె ఇంటికి వెళ్లింది. శనివారం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు జహంగీర్ ఇంట్లో మృతదేహంగా పడి ఉండటాన్ని గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. తన కుమారుడు మద్యానికి బానిసై మృతి చెందాడని, అతని మరణంపై అనుమానం ఉందని తల్లి మహమ్మద్ ఫరీదా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు రాజగోపాలపేట పోలీసులు తెలిపారు.






