- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మేంద్రప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం: తలసాని శ్రీనివాస్ యాదవ్
ధర్మేంద్రప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యం, విద్యార్థులు, యువత, కాక్రోచ్‌ల విజయం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ధర్మేంద్రప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యం, విద్యార్థులు, యువత, కాక్రోచ్‌ల విజయం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థులకు హ్యాట్సాఫ్ చెప్పారు. విద్యార్థులను చూసి దేశం గర్విస్తోందన్న తలసాని వారి ఉద్యమం ఏస్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లాఠీఛార్జ్ చేసినా, దాడులకు పాల్పడినా, దేశ ద్రోహులన్నా... కేంద్రం దిగి రాక తప్పలేదని వ్యాఖ్యానించారు.
విద్యార్థుల పోరాటంలో న్యాయం ఉందని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సంఘీభావం ప్రకటించారని తెలిపారు. మ్యానిఫెస్టోలు ప్రకటించే సమయంలో, హామీలు ఇచ్చేటపుడు పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాలని తలసాని పేర్కొన్నారు. విద్యార్థుల దెబ్బకు పార్లమెంట్ గేట్లు ముయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారికి విద్యార్థులు ఇచ్చిన సమాధానం 'ఇంక్విలాబ్ జిందాబాద్- భారత్ మాతా కీ జై' అని తలసాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.






