- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్..!
జాతీయ రహదారిని ఆనుకొని నేలకొండపల్లి కూసుమంచి రహదారి పక్కనే సుమారు రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి మండల రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

దిశ, నేలకొండపల్లి: జాతీయ రహదారిని ఆనుకొని నేలకొండపల్లి కూసుమంచి రహదారి పక్కనే సుమారు రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి మండల రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇంతటి విలువైన ఈ భూమిపై కొంతమంది రియల్ బ్రోకర్ల కన్ను పడి ఏకంగా ప్లాట్లుగా చేసి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారన్న విషయం పాలేరు శాసనసభ్యులు, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటికి తెలిసిన వెంటనే రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్ హుటాహుటిన రియల్టర్లు చెరపట్టిన ప్రభుత్వ భూమిని ఇటీవల పరిశీలించారు. మొత్తం రికార్డులు తిరగ చూసిన ఆయన ఆక్రమణ జరిగిందనే వాస్తవాన్ని గ్రహించి సమగ్ర సర్వేకు ఆదేశించారు.
దీంతో తహసీల్దార్ రాంప్రసాద్ తన సిబ్బందితో కలిసి గత రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. నేలకొండపల్లిలోని సింగారెడ్డి పాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 159/1లోని 25 కుంటల భూమిలో జాతీయ రహదారి భూసేకరణలో పోగా మిగిలిన విస్తీర్ణాన్ని హద్దులు పాతి ఫెన్సింగ్ వేశారు. గతంలో ఈ భూమిని మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టుల గృహ నిర్మాణ అవసరాల కోసం కేటాయించగా, మరల జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కోసం ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
అంతేకాకుండా జాతీయ రహదారి కోసం సేకరించిన మరో 7 కుంటల భూమితో పాటు, 159/1లో మరో 5.5 కుంటల భూమి కూడా ఇంకా రియల్టర్ల కబంధ హస్తాలలోనే ఉన్నట్లు కూడా అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ విషయమై జాతీయ రహదారి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా రియల్టర్లు అత్యాశతో ఎక్కడో ఉన్న సర్వే నంబర్లను ప్రభుత్వ భూమిలో చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించిన విషయాన్ని కూడా తెలుసుకుని సమగ్ర విచారణ చేస్తామని హామీనిచ్చారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురైనట్లు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఆయన కోరారు.
పంట కాలువకు మోక్షం..
సింగారెడ్డిపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 159/1 లో గత 60 ఏళ్లుగా 120 ఎకరాలకు నీటినందించే పంట కాల్వను రియల్ అక్రమార్కులు పూడ్చేశారు. అంతే కాకుండా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులను కూడా కాలువ లేదంటూ బుకాయించారు. దీంతో రెండు శాఖల అధికారులు ప్రక్కనే ఉన్న రైతులతో పాటు, గతంలో శాఖలో పనిచేసిన లస్కర్లు ను కూడా విచారించి పూడ్చిన కాలువను జేసీబీ సహాయంతో సరి చేశారు. దీంతో అధికారులకు ప్రజలు, సమీప రైతులు ధన్యవాదాలు తెలిపారు.
సమగ్ర సర్వే చేయాల్సిందే:ఏటుకూరి రామారావు
సర్వే నెంబర్ 159/1లో మొత్తం 25కుంటల భూమి ఉండాలని, ఎన్ హెచ్ సేకరించిన భూమిని పూర్తిగా వినియోగించనట్లు రికార్డులు చెబుతున్నాయని సిపిఎం జిల్లా నాయకులు ఏటుకూరి రామారావు తెలిపారు. ఈ విషయాన్ని మండల తహసీల్దార్ కు విన్నవించానని ఆయన చెప్పారు. సమగ్రంగా సర్వే నిర్వహిస్తే మరింత భూమి అక్రమార్కుల చెర నుండి బయటకు తీసి ప్రజా ప్రయోజనాలు వినియోగించవచ్చని సూచించారు.






