డెస్క్ జాబ్ చేస్తున్నారా..? ప్రతీ గంటకు 5 నిమిషాలు ఇలా చేయండి!

by Javid Pasha |

ప్రతీ గంటకు ఒకసారి 5 నిమిషాలు చేసే వాకింగ్‌తో డయాబెటిస్, ఒబేసిటీ రిస్క్ తగ్గుతుంది.

డెస్క్ జాబ్ చేస్తున్నారా..? ప్రతీ గంటకు 5 నిమిషాలు ఇలా చేయండి!
X

దిశ, ఫీచర్స్ : మీరు రోజంతా కూర్చొని ఉండే డెస్క్ జాబ్ చేస్తున్నారా? అయితే ప్రతీ గంటకు ఒకసారిపైకి లేచి 5 నిమిషాలపాటు వాకింగ్ చేయడం బెటర్.. అంటున్నారు కొలంబియా యూనివర్సిటీకి చెందిన నిపుణులు. దీనివల్ల నిశ్చల జీవనశైలి వల్ల వచ్చే డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

అధ్యయనంలో భాగంగా సుమారు 19,300 ఉద్యోగుల హెల్త్ డేటాను నిపుణులు విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు గంటల తరబడి కదలికలేకుండా ఉండేవారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. అలాగే చిన్న చిన్న బ్రేక్‌లు, నడక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని గమనించారు. ముఖ్యంగా ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుంటే.. మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, పని ఉత్పాదకత కూడా మెరుగవుతాయని నిర్ధారించారు.

ప్రయోజనాలు

ప్రతీ గంటకు ఒకసారి 5 నిమిషాలపాటు చేసే చిన్న చిన్న నడకలు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయని, కూర్చొని ఉండడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఆఫీసు ఉద్యోగులు లేదా డెస్క్ జాబ్ చేసేవారు ఈ సాధారణ అలవాటును అనుసరిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవచ్చునని సూచిస్తున్నారు. పైగా ఇది ఆరోగ్యకరమైన జీవనశైలికి సులభమైన మార్గమని చెబుతున్నారు.

Next Story