పతనం మొదలైంది... వినాశనం తప్పదు: రఘువీరారెడ్డి వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-25 12:14:51  IST  )

ఇకనైనా బాధ్యతగా పనిచేయాలని లేకపోతే ప్రజాగ్రహం తప్పదని బీజేపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి రఘువీరారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై ఆయన స్పందించారు...

పతనం మొదలైంది... వినాశనం తప్పదు: రఘువీరారెడ్డి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇకనైనా బాధ్యతగా పనిచేయాలని లేకపోతే ప్రజాగ్రహం తప్పదని బీజేపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి రఘువీరారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై ఆయన స్పందించారు. ధర్మేంద్ర రాజీనామా యువత విజయమని ప్రశంసించారు. ప్రజాస్వామ్య ఉద్యమాలకు కేంద్రం తలొగ్గిందని ఎద్దేవా చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వల్ల లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ ప్రభుత్వ అహంకారానికి పతనం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకే 152 నీట్ పేపర్ లీకులు అయ్యాయని తెలిపారు.

మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక

‘‘పార్లమెంట్‌లోనూ నీట్ లీక్ పై చర్చ జరగాలి. ఈ లీకుల్లో బీజేపీ వాళ్ల ప్రమేయం ఉంది. అందుకే యువత భగ్గుమంది. పట్టువదలని విక్రమార్కుడిలా రాహుల్ గాంధీ పోరాటం చేశారు. బీజేపీ కొమ్ములను విరిచారు. రామ్ మందిరంలో దోపిడీ జరిగింది. నరేగాలో కూలీల కడుపు కొట్టారు. అన్ని సమస్యలపైనా దేశ ప్రజలు, యువత ఇదే విధంగా పోరాటం చేయాలి. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోడీ పెట్టుకున్నారు. మోడీ ప్రభుత్వానికి పతనం మొదలైంది. వినాశనం తప్పదు.’’ అని రఘువీరారెడ్డి హెచ్చరించారు.

Next Story