- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
45 రోజులకోసారి మండల ప్రజాపరిషత్ సమావేశాలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
by Ajay Maddhiboyina |
ప్రతీ 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మండల ప్రజాపరిషత్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతీ 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మండల ప్రజాపరిషత్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపరిషత్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్టు సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రజాపరిషత్ సమావేశాల్లో సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొనాలని స్పష్టం చేశారు. ఇందుకు మండల ప్రత్యేక అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాల అమలు, గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరగాలన్నారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను, జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
Next Story






