- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిట్టిబాబుగా వెంకీ.. 'ఆదర్శ కుటుంబం' నుంచి బిగ్ అప్‌డేట్
'ఆదర్శ కుటుంబం' నుంచి బిగ్ అప్‌డేట్ ఎల్లుండి రానుంది.

దిశ, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో విక్టరీ వెంకటేష్ దూసుకు వెళ్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసి... బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదర్శ కుటుంబం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మరోసారి కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నారు వెంకీ మామ. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.
ఈ నెల 27వ తేదీన ఎల్లుండి ఆదర్శ కుటుంబం సినిమా ప్రపంచాన్ని పరిచయం చేయనున్నట్లు మేకర్స్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చిట్టిబాబు పాత్రలో వెంకీ కనిపించనున్నారు. స్వర్ణగా శ్రీనిధి శెట్టి, నటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నారా రోహిత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. కాగా ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.






