- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఫడ్నవీస్.. శివసేన నేత కీలక వ్యాఖ్యలు
దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతారన్న ఊహాగానాలు దేశరాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

దిశ, వెబ్‌డెస్క్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై దేశరాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఢిల్లీ హైకమాండ్ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేలను ఉన్నపళంగా రమ్మని పిలవడంతో.. ఈ చర్చకు మరింత వేడినిచ్చినట్లయింది. తాజాగా శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత సంజయ్ రావత్ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ కు హైకమాండ్ విద్యాశాఖను అప్పగించనుందని, మహారాష్ట్ర సీఎం మార్పు ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి.
మరోవైపు ఫడ్నవీస్ భార్య చేసిన ప్రకటన ఇందుకు బలం చేకూరుస్తోంది. తన భర్త మహారాష్ట్రలోనే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఫడ్నవీస్ భార్య అమృత పేర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కు విద్యాశాఖమంత్రి పదవిపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్యను నివారించేందుకు ఇప్పటికే కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకుంటోందన్నారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






