- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవనాల పనులను పరిశీలించిన కలెక్టర్
మెట్‌పల్లి పట్టణంలోని నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.

దిశ, మెట్‌పల్లి : మెట్‌పల్లి పట్టణంలోని నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన ఆసుపత్రి భవనంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులను పూర్తిచేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మెట్‌పల్లి మండలం అమ్మక్కపేట అర్బన్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనాన్ని కూడా పరిశీలించారు.
అక్కడ జరుగుతున్న పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతకు ఎలాంటి రాజీ పడకుండా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆరోగ్య కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ పరిశీలనలో మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాజిద్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ నీత, ఎంపీడీవో, వైద్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






