చిక్కడపల్లి వెంకన్న సన్నిధిలో ఎమ్మెల్యే ముఠా గోపాల్

by Batti.Sumithra |

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.

చిక్కడపల్లి వెంకన్న సన్నిధిలో ఎమ్మెల్యే ముఠా గోపాల్
X

దిశ, రాంనగర్ : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా చూడాలని, పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, కార్యదర్శి దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మీడియా ఇన్చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, పద్మ, పోస్టర్ శీను, జి.శ్రీనివాస్, గండు వెంకటేష్, సిలివేరు వెంకటేష్, వెంకటేష్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story