మైక్రో ఫైనాన్స్ కేసులో మరో నిందితుడు అరెస్ట్

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ కేసులో మ‌రో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుభాక్షేత్ర పేరుతో కోట్లు కొట్టేసిన బండి శివ‌కుమార్ నాగోల్ లో ఈవోడ‌బ్ల్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మైక్రో ఫైనాన్స్ కేసులో మరో నిందితుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ కేసులో మ‌రో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుభాక్షేత్ర పేరుతో కోట్లు కొట్టేసిన బండి శివ‌కుమార్ నాగోల్ లో ఈవోడ‌బ్ల్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదైన‌ప్ప‌టి నుండి శివ‌కుమార్ ప‌రారీలో ఉన్నారు. ఇక ఇప్ప‌టికే ఈ కేసులో ర‌మాకాంత్ రెడ్డి, ర‌మావ‌త్ మ‌ధు ల‌ను పోలీసుల‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ముఠా ఎక్కువ లాభాల ఆశ చూపించి ఏపీ, తెలంగాణ‌లో బాధితుల నుండి కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసింది.

త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ వ‌డ్డీ ఇస్తామ‌ని న‌మ్మించింది. అమాయ‌క ప్ర‌జ‌ల వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని జ‌ల్సాల‌కు పాల్ప‌డింది. కోట్ల రూపాయ‌ల భ‌వ‌నాలు నిర్మించ‌డం, ఖ‌రీదైన కార్ల‌లో తిరుగుతూ జ‌ల్సాలు చేయ‌డం లాంటివి చేయ‌డంతో ప్ర‌జ‌లు న‌మ్మి డ‌బ్బులు పెట్టుబ‌డిగాపెట్టారు. డ‌బ్బు తీసుకున్న త‌ర‌వాత కొన్నిరోజుల పాటు వ‌డ్డీ ఇచ్చి త‌ర‌వాత మొండిచేయి చూపించ‌డంతో పోలీసులను ఆశ్ర‌యించారు. ఈ మోస‌గాళ్ల మాయ‌లో ప‌డి చాలా మంది ఆత్మ‌హ‌త్యలు చేసుకున్న ఘ‌ట‌న‌లు సైతం ఆందోళ‌న క‌లిగించాయి.

Next Story