- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యుదయ కవిత్వ పరిమళాలు మరింత వికసించాలి
అభ్యుదయ భావాలు, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కవిత్వం, పాటల సాహిత్యం మరింత వికసించాలని పర్యాటక, ఎక్సైజ్, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

దిశ, కొల్లాపూర్ : అభ్యుదయ భావాలు, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కవిత్వం, పాటల సాహిత్యం మరింత వికసించాలని పర్యాటక, ఎక్సైజ్, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో కవి కల్వకోలు మద్దిలేటి** రచించిన "వనమంచు పల్లె" పాటల పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లె జీవన విధానం, ప్రకృతి పరిరక్షణ, అభ్యుదయ భావాలు, దళిత చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాటలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనేక సామాజిక ఉద్యమాలకు పాటలే ప్రధాన సాధనంగా నిలిచాయని గుర్తు చేశారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, మాదకద్రవ్యాల వినియోగం, మత్తు పానీయాల బారిన పడటం, దొంగతనాలు, లూటీలు, దోపిడీలు వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేలా కవులు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
అలాగే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను అరికట్టే దిశగా సాహిత్యం ప్రభావవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. కవులు, రచయితలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రచయిత కల్వకోలు మద్దిలేటిని అభినందిస్తూ, ఇలాంటి విలువైన పాటల పుస్తకాలు మరిన్ని వెలువరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కల్వకోలు ఉపసర్పంచ్ గువ్వలి చిన్న కుర్మయ్య, మాజీ ఎంపీటీసీ యం.లక్ష్మీనారాయణ, వి.పరుశరామరాజు (పంచాయతీరాజ్ సూపరింటెండెంట్), సింగిల్ విండో డైరెక్టర్ పస్పుల నరసింహ, ఉల్లంగొండ శివశంకర్, కొండూరు గ్రామ సర్పంచ్ కేతూరు ధర్మతేజ, నూనె క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.






