- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా సలహా మేరకే ధర్మేంద్ర రాజీనామా.. మోడీ నా మాట విన్నారు: శరద్ పవార్ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ తన మాట ప్రకారమే ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా సలహా ప్రకారమే ధర్మేంద్ర రాజీనామా చేశారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నా సలహా కోరారని, నేను ఇచ్చిన సలహాను ప్రధాని మోడీ స్వీకరించినట్లు చెప్పారు. ఇవాళ మహారాష్ట్రలో మాట్లాడిన ఈ వ్యాఖ్యలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశ యువత చేపట్టిన సుదీర్ఘ పోరాటాన్ని, వారి పట్టుదలను పవార్ కొనియాడారు. ఇది అణచివేతకు వ్యతిరేకంగా యువత సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుక ఎంత శక్తివంతమైనదో ఈ పోరాటం నిరూపించిందని, విద్యార్థుల ఐక్యత ముందర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని తెలిపారు. ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నాయకులకు మరియు ఎంపీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పవర్ వ్యాఖ్యలపై పొలిటికల్ బజ్:
తాను చెప్పిన మాట ప్రకారమే మోడీ ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించారంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. నిజానికి మూడు రోజుల క్రితం ఓ వైపు నీట్ పపర్ లీక్ పై సీజేపీ యువత, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే మరోవైపు శరద్ పవార్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లిన పవార్ ను మోడీ ఆత్మీయంగా ఆహ్వానించారు. స్వయంగా గుమ్మం వద్దకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. అయితే ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న శరత్ పవార్.. ఎన్డీయే కూటమికి శరద్ పవార్ పార్టీ మద్దతు ఇవ్వబోతోందని గత కొద్ది కాలంగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఇందుకోసం అజిత్ పవార్ ఎన్సీపీ, శరత్ పవార్ ఎన్సీపీ ఏకం కాబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శరద్ పవార్ మోడీతో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇంతలో తాను చెప్పిన మాటను మోడీ విన్నారని శరత్ పవార్ చెప్పడం ఆసక్తిగా మారింది.
పవార్ వ్యాఖ్యల వెనుక వ్యూహమా?
తన మాట ప్రకారమే కేంద్ర మంత్రి రాజీనామా చేశారని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల వెనుక నిజం ఉందా లేక తాజా పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు శరత్ పవార్ ఈ స్కెచ్ వేశారా అనేది సందేహంగా మారింది. మోడీతో భేటీ అనంతరం పవార్ కుమార్తె సుప్రియా సూలే మాట్లాడుతూ రైతుల సమస్యలు, సాగు సంబంధింత ఇబ్బందులకు సంబంధించి ఓ మెమొరండంను మోడీకి శరద్ పవార్ ఇచ్చారని చెప్పారు. పైకి ఈ మాటలు చెప్పినా అంతర్గతంగా మాత్రం రాజకీయాలపై చర్చించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసిన వెంటనే మహారాష్ట్ర నేతలకు బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాలు మహారాష్ట్ర చుట్టూ తిరుగుతుండటంతో శరద్ పవార్ వ్యాఖ్యల్లో నిజమెంతా? అనేది కాలమే నిర్ణయించనుంది.






