- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిట్యాల శివారులో ఏరులై పారుతున్న తాగునీరు.. పట్టించుకునే వారే లేరా?
ఇంటింటికీ తాగునీరు అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలతో జల సంపద కళ్లెదుటే కాలువలా మారుతోంది.

దిశ,తాడ్వాయి: ఇంటింటికీ తాగునీరు అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలతో జల సంపద కళ్లెదుటే కాలువలా మారుతోంది. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ శివారులో వేలాది లీటర్ల భగీరథ నీరు వృథాగా పోతున్న అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. గ్రామ శివారులో ప్రధాన పైప్‌లైన్ ఏకంగా పగిలిపోయి, నీరు ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. అక్కడ ఉన్న ఓ రైతు నీటి ఉధృతిని చూసి ఏమి చేయాలో తోచని కనీసం తాత్కాలికంగానైనా ఆపవచ్చనే ఉద్దేశంతో ఏకంగా మూడు పెద్ద రాళ్లను ఆ లీకేజీ రంధ్రం వద్ద అడ్డుగా పెట్టారు.
అయినా ఫలితం లేదు. నీరు మరింత ఉధృతంగా ఎగిసిపడుతోంది. దీంతో పక్కన ఉన్న మొక్కజొన్న పంటలోకి నీరు వృధాగా వెళుతుంది. ప్రభుత్వ అధికారులు చేసే పనులకు.. ప్రజలు ఇలా రాళ్లు పెట్టి నీటిని ఆపే దుస్థితి వచ్చిందంటూ అటు వైపు దారి పోయే ప్రయాణికులు, స్థానికులు తీవ్రంగా విసుగుకుంటున్నారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం ఒకవైపు అయితే ఇలాంటి అమూల్యమైన తాగునీరు వృథా అవుతున్నా, సంబంధిత అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం పై అటువైపుగా వెళ్తున్న వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, ఆ లీకేజీని శాశ్వతంగా అరికట్టాలని కోరుతున్నారు.






