ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మంత్రి పొన్నం ప్రభాకర్

by Ajay Maddhiboyina |

కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విద్యార్థులు, ఉద్య‌మ‌కారుల విజ‌యం అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. ఇది అప్ర‌జాస్వామ్యం మీద గెలుపు అని వ్యాఖ్యానించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విద్యార్థులు, ఉద్య‌మ‌కారుల విజ‌యం అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. ఇది అప్ర‌జాస్వామ్యం మీద గెలుపు అని వ్యాఖ్యానించారు. ఈరోజు దిగి వ‌చ్చిన ప్ర‌భుత్వం రేపు గ‌ద్దె దిగ‌డం త‌ప్ప‌ద‌ని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశ‌వ్యాప్తంగా ఐక్య‌తతో కేంద్రం దిగివ‌చ్చింద‌న్నారు. భ‌విష్య‌త్ లో విద్యార్థుల జీవితాల‌తో చ‌ల‌గాటం ఆడ‌వ‌ద్ద‌నే గుణ‌పాఠం ప్రభుత్వానికి వ‌చ్చింద‌న్నారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా బీజేపీ ప్ర‌భుత్వ ప‌త‌నానికి మొద‌టి మెట్టు అని అన్నారు. విద్యార్థుల ఉద్య‌మాన్ని క‌రెంట్ బంద్ చేసి, మెట్రోను బంద్ చేసి, లాఠీ ఛార్జ్ చేసి అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ వేల మంది విద్యార్థులు వ‌చ్చి ధ‌ర్నా చేస్తున్నారంటే ప్ర‌భుత్వంపై ఎంత వ్య‌తిరేక‌త ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. ఉద్య‌మంతో గెలిచిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ప్ర‌జావ్య‌తిరేక ఉద్య‌మాల్లో త‌ప్ప‌కుండా క‌లిసి పోరాడాల‌ని పిలుపునిచ్చారు.

Next Story