కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-25 10:34:03  IST  )

అనకాపల్లి జిల్లా కోటవురట్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినులకు వడ్డించిన అల్పాహారం కలుషితం అయింది. దీంతో పలువురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ..

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..  విద్యార్థులకు అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) కోటవురట్ల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(Kasturba Gandhi Balika Vidyalaya)లో విద్యార్థినులకు వడ్డించిన అల్పాహారం కలుషితం అయింది. దీంతో పలువురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తీసుకున్న కొంతసేపటికి కడుపునొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో విద్యార్థులు బాధపడ్డారు. దీంతో వారిని స్థానిక సీహెచ్‌సీకి తరలించడంతో వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించారు. విద్యార్థులందరి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. బాలికలను తమ పర్యవేక్షణలో ఉంచి తగిన మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. తక్షణమే ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు.

కాగా ఈ సంఘటన తెలుసుకున్న విద్యాశాఖ, స్థానిక రెవెన్యూ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేజీబీవీ పాఠశాలను సందర్శించి అల్పాహారం తయారీ తీరును, నాణ్యతను పరిశీలించారు. ఈ ఘటనకు గల అసలు కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా వంటశాలలో పరిశుభ్రత చర్యలు పాటించాలని అధికారులను ఆదేశించారు.

Next Story