- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే రాజీనామా చేస్తున్నా .. రిజైన్ లేఖలో ధర్మేంద్ర ప్రదాన్ కీలక వ్యాఖ్యలు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సీజేపీ ఆందోళనలకు కేంద్రం దిగివచ్చింది. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో యువత ఆందోళలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. మరో గంటలో కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ ప్రతినిధుల మూడో విడత చర్చలు జరిగే గంటకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదు:
రాజీనామా సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ ఓ లేఖను తన సోషల్ మీడియా వేదిగా విడుదల చేశారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాల తనను బాధించాయని నేను వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం లేదని ఈ లేఖలో పేర్కొన్నారు. దేశ యువతను గందరగోళంలోకి చిక్కుకోనివ్వనని , విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మనస్తాం కలిగించాయన్నారు. నేను ఎప్పుడూ నా బాధ్యతల నుంచి తప్పించుకోలేదని, యువ శక్తే ఈ దేశం అసలైన శక్తి అన్నారు. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశానని దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. యువత తమ చదువు కోసమే సమయం కేటాయించాలని మంత్రిగా ఇన్నాళ్లు నాకు అవకాశం కల్పించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవకు నా అత్యున్నత ప్రాధాన్యత అన్నారు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించామని విజయవతంగా నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించామన్నారు.
కేంద్రానికి మా సత్తా చూపించాం:
ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై సీజేపీ స్పందించింది. ప్రజాస్వామ్యం గెలిచింది. కాక్రోచ్‍లు గెలిచారు అని ఎక్స్ వేదికగా పేర్కొంది. కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామని పేర్కొంది. కాగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని సీజేపీ నేతృత్వంలో యువత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 36 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో నిరాహార దీక్ష చేస్తు్న్న సోనమ్ వాంగ్ చుక్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించడం, ఈ నెల 20వ తేదీన సీజేపీ ఇచ్చిన చలో సంసద్ పిలుపు సందర్భంగా నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగించడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే రెండు దఫాలుగా సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపగా ఇవాళ మూడో విడత చర్చలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.






