- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్.. వెంకీ అట్లూరి కామెంట్స్‌తో పెరిగిన అంచనాలు
ఈ సినిమాలో సూర్య నిజజీవిత భాగస్వామి, కోలీవుడ్ స్టార్ నటి జ్యోతిక ఒక పవర్ ఫుల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

దిశ, సినిమా: టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా, మమిత బైజు హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనిల్ కపూర్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచింది. వరుస అప్‌డేట్‌లతో ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకి సంబంధించి ఒక బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో సూర్య నిజజీవిత భాగస్వామి, కోలీవుడ్ స్టార్ నటి జ్యోతిక ఒక పవర్ ఫుల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చాలా కాలం తర్వాత సూర్య, జ్యోతిక రీల్ లైఫ్‌లోనూ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. వెంకీ అట్లూరి రివీల్ చేసిన ఈ మైండ్ బ్లోయింగ్ న్యూస్‌తో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.






