- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నై లవ్ స్టోరీ సక్సెస్.. ఆమె ఎప్పుడూ నా వెంటే ఉంటుంది అంటూ శ్రీ గౌరీ ప్రియ ఎమోషనల్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ కాంబినేషన్‌లో వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ కాంబినేషన్‌లో వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చెయ్యగా.. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ ఎమోషనల్ అయ్యారు. ‘జులై 23న ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి, సినిమా రిలీజైన ఫస్ట్ డే నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. కలెక్షన్లు కూడా మామూలుగా లేవు. మల్టీఫ్లెక్స్ ఆడియన్స్, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అని కాకుండా.. ప్రతి ఒక్కరు ఒక సినిమాను ఎంజాయ్ చేయడం, అది కూడా మా సినిమా, మన సినిమా అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఎగ్జైటెడ్‌గా, సంతోషంగా ఉంది. లైఫ్‌లో వెనక్కి చూస్తూ ముందుకు వెళ్లకూడదు.. కానీ ఒక్క క్షణం ఆగి వెనక్కి చూడొచ్చు కదా.. అలా ఈ క్షణం ఆగి వెనక్కి చూస్తే ‘చెన్నై లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్’ అనే పదం కనిపిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి. ఒక అద్భుతమైన సినిమా చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు.. నన్ను చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటుంది’ అంటూ ఈ సందర్భంగా స్టేజ్‌పైనే ఎమోషనల్ అయింది హీరోయిన్ శ్రీగౌరి ప్రియ.






