- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మార్వో ఆఫీస్ ముందు రైతుల ఆందోళన
యాచారం తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామసర్పంచ్ కొలన్ రమాదేవి మల్ రెడ్డి, గ్రామస్తులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.

దిశ, యాచారం : మండల పరిధిలో మొండి గౌరెల్లి, గ్రామంలోని సర్వేనెంబర్లు 19, 68, 127 లోని అసైన్డ్ భూములను సేకరించినందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి రెవెన్యూ అధికారులు 677 ఎకరాలకు సర్వే నిర్వహించారని భూ పరిహారం పెంచేందుకు స్పష్టత ఇవ్వడం లేదంటూ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామసర్పంచ్ కొలన్ రమాదేవి మల్ రెడ్డి, గ్రామస్తులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరతరాలుగా అసైన్డ్ భూములను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ రైతులు జీవిస్తున్నారని తెలిపారు.
పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అసైన్డ్ భూములను సేకరించేందుకు ముందుకు వస్తే ఉన్న భూములు పోతే ఎలా బతకాలి మార్కెట్ కు అనుగుణంగా పరిహారం పెంచాలని కబ్జాలో ఉన్న రైతులకు కూడా న్యాయం చేయాలని నకిలీలను ఏరివేయాలని ఆందోళన చేసినట్టు గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నకిలీలను ఏరి వేయకుండా అధికారులు ముందుకు వెళుతున్నారని ఆరోపించారు. భూ నష్టపరిహారం పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మర్రిపల్లి అంజయ్య యాదవ్, తాండ్ర రవి, బండిమీద కృష్ణ మాదిగ, గ్రామస్తులు పాల్గొన్నారు.






