- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రానికి మా సత్తా చూపించాం : ధర్మేంద్ర రాజీనామాపై సీజేపీ రియాక్షన్!
నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై సీజేపీ స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై సీజేపీ స్పందించింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన అభిజీత్ దీప్కే, ఆ పార్టీ సభ్యులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 36 రోజులుగా విద్యార్థులతో కలిసి తాము చేస్తోన్న పోరాటం ఫలించిందని, కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామన్నారు. కాక్రోచ్ లు గెలిచాయని, ప్రజాస్వామ్యానిదే గెలుపయిందని ఆనందించారు. ఈ పోరాటంతో తాము ఎవరికీ హీరోలు కావాలని అనుకోలేదని, కేవలం విద్యార్థుల కోసమే పోరాడామన్నారు. తమకు రాజకీయాలు అవసరం లేదని, తమ పోరాటానికి దక్కిన గొప్ప విజయం ఇది అని స్పష్టం చేశారు. ఇక్కడ ఎవరికి వారే హీరో అని, ఈ పోరాటంలో భాగమైన ప్రతి విద్యార్థికి కృతజ్ఞతలు తెలిపారు. ఎండనకా, వాననకా ప్రతిరోజూ పోరాడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 21 మంది విద్యార్థుల ఆత్మలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతి చేకూరుతుందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. వారందరి కోసం 2 నిమిషాల పాటు అందరూ మౌనం పాటించాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు కేంద్రప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లు కొట్టివేయాలని మరోసారి సీజేపీ డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా.. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేంతవరకూ తమ ఉద్యమం ఆగదని సీజేపీ స్పష్టం చేసింది. సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇంక్విలాబ్ జిందాబాద్.. భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై భీమ్.. నినాదాలతో జంతర్ మంతర్ నిరసనల ప్రాంతం హోరెత్తింది.






