- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లమలలో భక్తులతో శోభిల్లిన శివ క్షేత్రములు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, అంతర్ గంగా, బాణాల లోది, తదితర ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడింది.

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలో తొలి శ్రావణ మాసం సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, అంతర్ గంగా, బాణాల లోది, తదితర ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన సతీమణి డాక్టర్ అనురాధతో కలిసి శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ మాధవరెడ్డి, అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తాగునీరు, క్యూలైన్లు, ప్రసాద పంపిణీ తదితర ఏర్పాట్లతో పాటు భద్రతా చర్యలను కూడా చేపట్టారు. శ్రావణ మాసం సందర్భంగా రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.






