- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. ఫ్రీ కాస్ట్ వాల్ తొలగింపు
by Kodari Anjali |
దిశ ఎఫెక్ట్‌తో ఫ్రీ కాస్ట్ వాల్స్ తొలగించి.. కబ్జాదారులను డీసీ సమ్మయ్య హెచ్చరించారు.

X
దిశ, బడంగ్ పేట్: దిశ పత్రికలో ప్రచురితమైన భూ కబ్జాదారులు బరితెగింపు అనే శీర్షికపై స్పందించిన బడంగ్ పేట్ సర్కిల్ డీసీ సమ్మయ్య నాదర్ గుల్ డివిజన్, గుర్రం గూడా శ్రీ నివాసపురం రోడ్ నెంబర్ 10 లో ఈ రోజు శనివారం ఉదయం టౌన్ ప్లానింగ్ ఏసీపీ కళ్యాణ చక్రవర్తి, సూపర్వైజర్ సాయి కిరణ్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి ఫ్రీ కాస్ట్ వాల్స్ ను తొలగించారు. కబ్జాదారులు తీసుకువెళ్లిన ప్రభుత్వ బోర్డును తిరిగి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీ సమ్మయ్య హెచ్చరించారు. స్థలం ఆక్రమణపై ముందు నుండి పోరాటం చేస్తున్న నాదర్ గుల్ డివిజన్ బీజేపి మహిళా సెక్రెటరీ మంజుల వాణి అధికారులకు, దిశ పేపర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫ్రీ కాస్ట్ వాల్స్ నిర్మించిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Next Story






