- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి పోస్టులు పంపి మానసికంగా వేధించకండి.. మాకు లేని బాధ మీకేందుకు.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన తనూజ
ఒకరి కష్టసుఖాల్లో మరొకరం తోడుగా ఉంటున్నప్పుడు, లేని సమస్యలను సోషల్ మీడియాలో ఎందుకు సృష్టిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

దిశ, సినిమా: ‘ముద్దమందారం’ సీరియల్ ద్వారా ఫుల్ ఫేమ్ రాబట్టుకున్న తనూజ పుట్టస్వామి బిగ్‌బాస్ తెలుగు సీజన్9లో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె పలు షోస్, షాపింగ్ మాల్స్ ఒపెనింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, పలు షోలు, ఈవెంట్లలో పాల్గొంటున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, పవన్ సాయిల మధ్య విభేదాలు ఉన్నాయని, పవన్ సాయిని తనూజ దూరం పెట్టారంటూ వస్తున్న వార్తలపై ఆమె తాజాగా స్పందించారు. ఈ పుకార్లపై తనూజ మాట్లాడుతూ, బిగ్‌బాస్ ముగిసి చాలా కాలమైందని, షోలో పోటీలు, గొడవలు సహజమే అయినప్పటికీ బయటకు వచ్చాక తామంతా మంచి స్నేహితులుగానే ఉన్నామని స్పష్టం చేశారు. తమకు లేని బాధ మీకేందుకు అని ప్రశ్నించారు.
ఒకరి కష్టసుఖాల్లో మరొకరం తోడుగా ఉంటున్నప్పుడు, లేని సమస్యలను సోషల్ మీడియాలో ఎందుకు సృష్టిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గతంలో కళ్యాణ్ పడాల కష్టంలో ఉన్నప్పుడు తాను సాయం చేశానని, ఆ సమయంలో ముందుగా పవన్ సాయికే ఫోన్ చేసి సాయం కోరగా ఆయన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని తెలిపారు. కళ్యాణ్ తన కుటుంబానికి చాలాకాలంగా తెలుసని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశారు. అలాగే పవన్ సాయి, హరిత తమ పనుల్లో బిజీగా ఉన్నారని, వారిని అనవసర వివాదాల్లోకి లాగొద్దని కోరారు. నెగిటివ్ కామెంట్లు చేసే వారికి వేరే పని లేకపోతే ప్రశాంతంగా ఉండాలని, ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి అనవసర పోస్టుల వల్ల తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, ఇతరుల వ్యక్తిగత సంబంధాలపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.






