‘SIR పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి’:మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

by Jakkula.Mamatha |

ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ పై దృష్టి సారించాలని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.

‘SIR పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి’:మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
X

దిశ, మణుగూరు: ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి దశకు వచ్చిందని ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ పై దృష్టి సారించాలని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన శనివారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండలంలో ఉన్నటువంటి 68 బూతుల్లో ప్రతి ఒక్కరు మన కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టాలు, గ్రామస్తులు బస్తి ఏరియాలో కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యే విధంగా చూడాలన్నారు.

ఇప్పుడు ఓటు కోల్పోతే మరల నమోదు చేయించుకోవాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుందన్నారు. ఏ బూత్‌లలో పర్సంటేజ్ తక్కువ నమోదు అయిందో ఆ బూత్‌లను గుర్తించి దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, ముత్యం బాబు, వట్టం రాంబాబు, నూకారపు రమేష్, ఎడ్ల శ్రీనివాస్, ఆడప అప్పారావు, యాదగిరి గౌడ్, ఆవుల నరసింహారావు, అక్కి నరసింహారావు, జావిద్ భాష, బోశెట్టి రవి, గుర్రం సృజన్, రంజిత్, వడ్లూరి రాంబాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story