ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా..గంభీర్ పై ట్రోల్స్ షురూ!

by velandi.Saikiran |

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన త‌రుణంలో గంభీర్ కూడా రాజీనామా చేయాలంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా..గంభీర్ పై ట్రోల్స్ షురూ!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేప‌థ్యంలో ఓ మెట్టు దిగి వ‌చ్చారు ధర్మేంద్ర ప్రధాన్‌. త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తూ అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు క్రికెట్ అభిమానులు. భారత జట్టు వరుస వైఫల్యాలకు కారణమైన గంభీర్ కూడా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు చేసిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగివచ్చిన నేపథ్యంలో... క్రికెట్ అభిమానుల కోసం గంభీర్ కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

లేకపోతే క్రికెట్ అభిమానులు కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ 2027కు భారత జట్టు వెళ్తే... ఓటమి ఖాయమని చెబుతున్నారు. అంత కంటే ముందే గంభీర్ పక్కకు తప్పుకుంటే... బాగుంటుందని కోరుతున్నారు. గంభీర్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీకి అవకాశం ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత టాలెంట్ ఉన్న సీనియర్ క్రికెటర్లకు భారత జట్టులో అవకాశం రావడం లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హర్షిత్ రాణా, సుందర్ లాంటి కొంతమందికి మాత్రమే గంభీర్ ఛాన్సులు ఇస్తూ.. భారత జట్టును దిగజార్చుతున్నాడని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయిందని చెబుతున్నారు. అందుకే గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story