- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా రెండు డిమాండ్లు మిగిలి ఉన్నాయ్ : రాహుల్ గాంధీ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వాగతించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వాగతించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి లభించిన విజయంగా దీనిని ఆయన అభివర్ణించారు. దేశంలోని విద్యావ్యవస్థ పునర్నిర్మాణంలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నానని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అన్యాయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ధైర్యంగా పోరాడిన యువతకు, విద్యార్థులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు చూపిన పట్టుదల, ఐక్యతను చూసి ఎంతో గర్విస్తున్నానని, వారి ఉద్యమ స్ఫూర్తి ప్రశంసనీయమని కొనియాడారు. ఈ నిర్ణయంతోనైనా దేశ విద్యావ్యవస్థలో పారదర్శకమైన, సమూలమైన సంస్కరణలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. విద్యాశాఖ మంత్రి రాజీనామాతోనే సమస్య ముగిసిపోలేదని, తమ ముందు మరికొన్ని కీలక డిమాండ్లు మిగిలే ఉన్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దేశ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే.. నిరసనలు తెలిపిన విద్యార్థులపై పలు చోట్ల జరిగిన లాఠీఛార్జి ఘటనలపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.






