- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మేంద్ర రాజీనామాపై స్పందించిన సోనమ్ వాంగ్ చుక్.. వ్యవస్థాగత మార్పులకు పునాది
నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ.. దేశ యువత ఆకాంక్ష మేరకు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ.. దేశ యువత ఆకాంక్ష మేరకు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని శాంతి, సహనం, దేశ యువత ప్రదర్శించిన అపూర్వమైన పట్టుదల సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. విద్యార్థులు, యువత సాధించిన ఈ విజయం దేశంలో ప్రజాస్వామ్య బలాన్ని మరోసారి చాటిచెప్పేలా ఉందన్నారు.
ఈ సందర్భంగా పోరాటంలో కీలక పాత్ర పోషించిన జెన్ జీ (Gen Z) ప్రతినిధులకు, సీజేపీ సభ్యులకు సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. నీట్ పరిణామాలపై ఎక్కడా వెనక్కి తగ్గకుండా, శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతూ భావి తరాల భవిష్యత్తు కోసం ధైర్యంగా పోరాడారని కొనియాడారు. అలాగే ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచి, దేశవ్యాప్తంగా ఏకమై గళం విప్పిన పౌరులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలంతా సంఘటితంగా నిలబడితే ఎలాంటి అధికారాన్నైనా జవాబుదారీగా మార్చవచ్చని ఈ పరిణామం రుజువు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన దేశం పాలనలో జవాబుదారీతనం, విద్యావ్యవస్థలో పారదర్శక సంస్కరణల దిశగా అడుగులు వేస్తోందని వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు. ఈ రాజీనామా కేవలం ఒక పదవి విరమణ మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో వ్యవస్థాగత మార్పులకు ఇది పునాదిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






